February Bank Holidays | ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నగదు లావాదేవీలతోపాటు ఇతర సర్వీసులు కూడా ఆన్లైన్లోనే సాగుతున్నా.. బ్యాంకు శాఖలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా ఉంది. బ్యాంకులో లావాదేవీలు, ఇతర సర్వీసుల కోసం వెళ్లే వారు తాము బ్యాంకుకు వెళ్లాలనుకున్న రోజు పని చేస్తుందా.. సెలవు ఉందా అన్న సంగతి తెలుసుకుంటే కాసింత రిలీఫ్‌గా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఆర్బీఐ సెలవు దినాలు వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం వచ్చే నెలలో 10 రోజులు బ్యాంకులు పని చేయవు. వాటిల్లో కొన్ని సెలవు దినాలు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా వర్తిస్తాయి. నేషనల్ బ్యాంక్ హాలీడేస్ మాత్రం దేశవ్యాప్తంగా అమలవుతాయి.