Bank Holidays | ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ, జాతీయ సెలవులు, పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు వస్తాయి. సెలవు రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలు మినహా ఆఫ్ లైన్ సేవలు ఉండవు. ఈ నెల 15 వరకు బ్యాంకులకు పలు సెలవులు వచ్చాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న కూడా బ్యాంకులు పని చేయలేదు. ఈ రోజు నుంచి నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు. వచ్చే 14 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో పండుగలు, పర్వదినాల సందర్భంగా బ్యాంకులు కేవలం ఆరు రోజులు మాత్రమే సేవలందిస్తాయి. కనుక బ్యాంకుల్లో లావాదేవీలు జరిపే వారు సెలవులు, పండుగలు చెక్ చేసుకుని తమ బ్యాంకు శాఖకు వెళ్లడం సముచితంగా ఉంటుందని చెబుతున్నారు.
తేదీ —– సెలవు కారణం — ఏయే ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
18 —— జన్మాష్టమి ———— భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లక్నో
19 —— జన్మాష్టమి ———— అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గ్యాంగ్‌టక్, జైపూర్, జమ్ము, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్
20 —– శ్రీకృష్ణాష్టమి ———- హైదరాబాద్
21 —– ఆదివారం ————- దేశమంతా
27న నాలుగో శనివారం, 28న ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు. 29న గువాహటిలో శ్రీమంత్ శంకర్‌దేవ్ దినోత్సవం సందర్భంగా ఆ నగరంలో బ్యాంకులకు సెలవు. 31న గణేశ్ చతుర్థి సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పనాజీల్లో బ్యాంకులు పని చేయవు.