INDW vs HGKW : మహిళల ఆసియా కప్‌లో వరసగా రెండో విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓపెనర్ స్మృతి మంధాన(124) రికార్డు శతకం బాదేయగా.. దీప్తి శర్మ(3-9), శ్రీ చరణి(2-16)లు తిప్పేయగా హాంకాంగ్ చైనాను చిత్తు చేసింది టీమిండియా. హర్మన్‌ప్రీత్ సేన నిర్దేశించిన 194 పరుగుల ఛేదనలో ఆది నుంచి తడబడిన.. హాంకాంగ్ చైనా.. చివరకు 56 రన్స్‌కే కుప్పకూలింది. 137 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ సెమీస్ బెర్తును పట్టేసింది.
ఆసియా కప్‌లో జోరు మీదున్న భారత జట్టు వరసగా రెండో విజయంతో గర్జించింది. థాయ్‌లాండ్‌పై కాస్త తడబడినట్టు అనిపించినా ఈసారి టాప్ షోతో హాంకాంగ్ చైనాను బెంబేలెత్తించింది టీమిండియా. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఓపెనర్ స్మృతి మంధాన(124: 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) రికార్డు శతకంతో బౌలర్లను హడలెత్తించింది. ఆపై స్పిన్ ద్వయం దీప్తి శర్మ(3-9), శ్రీ చరణి(2-16)లు తిప్పేశారు. వీరి స్పిన్ ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా హాంకాంగ్ చైనా 56 పరుగులకే ఆలౌటైంది. అనుకున్నట్టే భారీ విజయంతో సెమీస్‌కు అర్హత సాధించింది టీమిండియా. నాకౌట్‌కు దూసుకెళ్లిన మొదటి జట్టు భారతే కావడం విశేషం.
That’s that from the second game for India in the #WomensAsiaCup #TeamIndia with a resounding 137-run win against Hong Kong as they march into the semi-final 👏👏
Scorecard – https://t.co/5owq9vvH2Z #INDvHK pic.twitter.com/3CVAox0O6c
— BCCI Women (@BCCIWomen) September 3, 2026
టాస్ ఓడిన భారత జట్టుకు షఫాలీ వర్మ(28)తో కలిసి శుభారంభమిచ్చింది స్మృతి మంధాన(124 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు). వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదగా.. స్కోర్ బోర్డు పరుగులు తీసింది. దంచేస్తున్న షఫాలీని ఔట్ చేయగా.. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది టీమిండియా. దాంతో.. రెండొందలకుపైగా స్కోర్ ఖాయమనుకున్న వేళ ప్రతీకా రావల్(10), రీచా ఘోష్ (11), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(10)లు.. మరోసారి నిరాశపరిచారు.
Innings break!
An extraordinary century from Vice-captain Smriti Mandhana powers #TeamIndia to 193/5 👏👏
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/l2ZXU8kEi7#WomensAsiaCup | #INDvHK pic.twitter.com/IVZMrhKxxM
— BCCI Women (@BCCIWomen) September 3, 2026
క్రీజులో నిలిచి సహకరించేవాళ్లు కరువైన మంధాన తన దూకుడు ఆపలేదు. కెరీర్లో రెండో టీ20 సెంచరీతో జట్టుకు కొండంత స్కోరందించింది. ఈ క్రమంలోనే మంధాన అంతర్జాతీయంగా మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుం ఆమె పేరిట10,869 పరుగులు ఉన్నాయి. మెరుపుల ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులతో హాంకాంగ్ చైనాను భయపెట్టింది టీమిండియా.