Konda Surekha : మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ (Konda Surekha) భగ్గుమన్నారు. టీడీపీ రక్తం ఉన్నోళ్లే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఆమె మండిపడ్డారు. అధిష్టానం ముందు తనను బర్తరఫ్ చేయకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడని పేర్కొన్న సురేఖ రేవంత్ బ్రదర్స్, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి కలిసి తమను కావాలనే టార్గెట్ చేశారని వెల్లడించారు.
క్యాబినెట్ మంత్రిగా వేటుకు గురైన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తెలుగుదేశం (టీడీపీ) నుంచి వచ్చాడని, టీడీపీ రక్తం ఉన్నోళ్లే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారని ఆమె ధ్వజమెత్తారు. మళ్లీ తనే సీఎం అవుతాననడం.. ఎమ్మెల్యే టికెట్లను సొంతంగా రేవంత్ ప్రకటించడం సరికాదని సురేఖ ఫైరయ్యారు. యాదాద్రి పాలకమండలిపై ఎవరి దగ్గరా చర్చించకుండా కమిటీ వేస్తే గొడవలు అయ్యాయని పేర్కొన్న ఆమె.. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? అంటే లేరని తనకు తెలుసునని మీడియాకు తెలిపారామె. ఈరోజు నాకు అన్యాయం జరిగింది, రేపు మీకూ జరుగుతుంది.. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి అని సూచించారు.
“Congress should get a survey done to understand the ground realities.
People are unhappy because we failed to fulfill the promises and six guarantees.
No MLA or minister is happy in this government. They cannot get a single work done. Even if we get the file signed with much… pic.twitter.com/kP6JGNvoql
— Revathi (@revathitweets) September 3, 2026
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని తెలిపిన సురేఖ ప్రభుత్వ వ్యతిరేకతపై సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. తాను పార్టీనిగానీ, సీఎంనుగానీ ఎక్కడా విమర్శించలేదని చెప్పిన ఆమె అయినా సరే తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. కనీసం అధిష్ఠానానికి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా అన్యాయంగా తనను బర్తరఫ్ చేశారని సురేఖ ఆవేదనకు లోనయ్యారు. మరి అధిష్టానంపై, ముఖ్యమంత్రిపై నోరుపారేసుకున్న జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. తన కూతురు సుస్మిత మాటలకు తనకు ఏం సంబంధం? అని ప్రశ్నించిన సురేఖ.. పదేళ్లుగా తన కూతురు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. బర్తరఫ్ చేశారని భయపడి తాను పార్టీ వదిలి వెళ్లనని, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనని తెలిపిన సురేఖ.. అసెంబ్లీకి కూడా హాజరవుతానని స్పష్టం చేశారు.
బర్తరఫ్‌పై కొండా సురేఖ ఫైర్
నన్ను బర్తరఫ్ చేయకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడు
రేవంత్ బ్రదర్స్, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి కలిసి మమ్మల్ని కావాలనే టార్గెట్ చేశారు
రేవంత్ టీడీపీ నుంచి వచ్చాడు.. టీడీపీ రక్తం ఉన్నోళ్లే ఇలాంటి కుట్ర… https://t.co/K53YrXSFVv pic.twitter.com/G8VdfRfLIW
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026