ICICI | బ్యాంకు ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ (Minimum Balance) భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి నిర్ణయించే విషయంలో పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అది ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదన్నారు. ఈ వ్యాఖ్యలు దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ పరిమితిని పెంచిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మినిమం బ్యాలెన్స్‌ను బ్యాంకులు తమ విచక్షణా ప్రకారం నిర్ణయించుకుంటాయన్నారు. కొన్ని బ్యాంకులు రూ.10వేలకు ఈ పరిమితిని పెంచితే.. మరికొన్ని బ్యాంకులు రూ.2వేల వద్దే ఉంచుతాయని.. కొన్ని బ్యాంకుల్లో ఈ నిబంధనను పూర్తిగా తొలగించారని మల్హోత్రా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసిన కొత్త రూల్స్ ప్రకారం.. ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారికి భారీగా పెరిగిన కనీస బ్యాలెన్స్ పరిమితిని పెంచింది.
మెట్రో, పట్టణ ప్రాంతాల కస్టమర్లకు నెలకు రూ.50వేలు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్‌ను ఉంచాల్సి ఉంటుంది. సెమీ అర్బన్ కస్టమర్లు రూ.25వేలు, గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లకు రూ.10వేలుగా నిర్ణయించింది. అయితే, ఇది కొత్త ఖాతాదారులకు మాత్రమే కాగా.. గతంలో ఉన్న అకౌంట్ హోల్డర్స్‌కు పాత నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ.10,000, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5వేల కనీస బ్యాలెన్స్ పరిమితులు ఉండవు. కనీస బ్యాలెన్స్ పాటించకపోతే బ్యాంకు 6శాతం లేదంటే రూ.500 (ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది) జరిమానా విధించనున్నది. అలాగే, నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదు డిపాజిట్ డిపాజిట్ చేసే అవకాశం ఉండగా.. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.150 ఛార్జీ వసూలు చేయనున్నది. ఇతర బ్యాంకులూ, 2020లోనే కనీస బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా, కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ.2,000 నుంచి రూ.10వేల వరకు పెంచాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.