Bank Holidays | కాలగర్భంలో మరో నెల కలిసిపోయింది. మంగళవారం 2023 ఆగస్టు మొదలైంది. ఈనాడు ప్రతి ఒక్కరూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా అన్నీ డిజిటల్ లావాదేవీలే నిర్వహిస్తున్నా.. కొన్ని అంశాలపై బ్యాంకు అధికారులను సంప్రదించడానికి వెళ్లాల్సి రావచ్చు. అలా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ఏ రోజు బ్యాంకు పని చేస్తుందో తెలుసుకోవడం కూడా అవసరమే. బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుంటే మన పని తేలికవుతుంది.
ఇప్పుడు బ్యాంకు ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా ఫైనాన్సియల్, నాన్ ఫైనాన్సియల్ పొందొచ్చు. వాటిల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ల్లో పేరు నమోదు చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి.
వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో సెలవులు కలుపుకుని ఆగస్టులో బ్యాంకులు 14 రోజులు పని చేయవు. వాటిల్లో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. మిగతా ఎనిమిది రోజులు బ్యాంకులు వివిధ కారణాల రీత్యా.. పని చేయవు. ఆగస్టులో బ్యాంకుల సెలవుల జాబితా చూద్దామా..!
తేదీ ——————- సెలవు కారణం
4 (ఆదివారం) ———— వారాంతపు సెలవు
8 (మంగళవారం) ——– టెండోంగ్ లోరుమ్ ఫాట్ (సిక్కింలో బ్యాంకులకు సెలవు)
12 (రెండో శనివారం) —- వారాంతపు సెలవు
13 (ఆదివారం) ———- వారాంతపు సెలవు
115 (మంగళవారం) —– స్వాతంత్ర్య దినోత్సవం
16 (బుధవారం) ——— పార్శీ నూతన సంవత్సరాది (మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు)
18 (శుక్రవారం) ——— తిథి శ్రీమంత శంకర్ దేవా (అసోంలో బ్యాంకులకు సెలవు)
20 (ఆదివారం) ——— వారాంతపు సెలవు
26 (నాలుగో శనివారం)– వారాంతపు సెలవు
27 (ఆదివారం) ——— వారాంతపు సెలవు
28 (సోమవారం) ——– తొలి ఓనం (కేరళలో బ్యాంకులకు సెలవు)
29 (మంగళవారం) —— తిరుఓనం (కేరళలో బ్యాంకులకు సెలవు
30 (బుధవారం) ——— రక్షాబంధన్ (రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు)
31 (గురువారం) ——— రక్షా బంధన్ శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్ -లాంబో సోల్ పర్వదినం సందర్భంగా ఉత్తరాఖండ్, అసోం, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు.
కోచి, తిరువనంతపురం నగరాల్లో ఈ నెల 26 నుంచి 29 వరకూ వరుసగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 26న నాలుగో శనివారం, 28న ఆదివారం, 29న తొలి ఓనం, 30న తిరు ఓనం సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు.