న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఖాతాదారులకు శుభవార్తను అందించింది. బ్యాంకుప్రకటించిన ప్రత్యేక ఆఫర్ కింద బంగారం, గృహ, వాహన, ఇతర రుణాలపై ప్రాసెసింగ్ఫీజును ఎత్తివేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల చివరి వరకు ఆఫర్ అమలులో ఉండనున్నది. ప్రస్తుతం బ్యాంక్ 6.90 శాతం వడ్డీతో గృహ, 7.30 శాతం వడ్డీతో వాహన రుణాలు అందిస్తున్నది. గృహ రుణాలపై నెలవారి చెల్లింపులు సరిగా చెల్లిస్తున్నవారికి రెండు ఈఎంఐలను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే వాహన, గృహ రుణాల మొత్తంలో 90 శాతం అందిస్తున్నది బ్యాంక్. దీంతో రూ.20 లక్షల లోపు తీసుకునే పసిడి రుణాలపై 7.10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్.