ముంబై, సెప్టెంబర్ 3: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘స్టార్ ధన్ వృద్ధి ఫిక్స్డ్ డిపాజిట్’ పేరుతో ప్రకటించిన ఈ స్కీంపై సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్.
ఈ డిపాజిట్లపై రుణాలు తీసుకోవడంతోపాటు ముందస్తుగా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా డిపాజిట్దారులకు కల్పించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది.