Bank of India | హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ).. ఎన్పీఏ ఖాతాదారులకు శుభవార్తను అందించింది. తమ బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ‘సంఝౌతా కార్నివాల్(రుణ విముక్తి) ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నది.
రుణ గ్రహీతలు సరైన కారణాలతో వారి రుణాన్ని తిరిగి చెల్లింపుల్లో విఫలమైనవారికి ఈ నెల 21 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ సువర్ణావకాశాన్ని తమ శాఖను సంప్రదించి ఒకేసారి ఎన్పీఏ ఖాతాకు సంబంధించిన రుణాలను వెంటనే చెల్లించి మూసివేసుకోవచ్చునని సూచించింది.