న్యూఢిల్లీ, ఆగస్టు 30:బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) కూడా తన వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఒక్కరోజు కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ 6.85 శాతానికి చేరుకోనున్నది. అలాగే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణరేటు 7.60 శాతానికి ఎగబాకింది. పెంచిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనల్లో వెల్లడించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో నెలవారి చెల్లింపులు అధికమవనున్నాయి.