Bank of England | లండన్, ఆగస్టు 3: అధిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించేక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వరుసగా 14వసారి వడ్డీ రేట్లను పెంచింది. గురువారం పావుశాతం పెంచడంతో బ్యాంక్ వడ్డీ రేటు 15 ఏండ్ల గరిష్ఠస్థాయి 5.25 శాతానికి చేరింది. గత నెలలో బ్రిటన్ ద్రవ్యోల్బణం 12 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గినప్పటికీ, మరోదఫా వడ్డీ రేట్లు పెంచడం గమనార్హం. బ్యాంక్ ద్రవ్యోల్బణం లక్ష్యమైన 2 శాతానికి ప్రస్తుతం నాలుగు రెట్లు అధికంగా ఉంది.