Bank of Baroda | బీవోబీ వడ్డీరేట్ల పెంపు
Bank of Baroda | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. నాలుగు నెలల తర్వాత మళ్లీ వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి.
- 5 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్
Bank of Baroda | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. నాలుగు నెలల తర్వాత మళ్లీ వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి చేరుకుంది. అలాగే మూడు, ఆరు, ఏడాది కాలపరిమితి రుణాలపై రేట్లను కూడా ఇంతే స్థాయిలో సవరించింది.
దీంతో మూడు నెలల రుణాలపై వడ్డీరేటు 8.45 శాతానికి చేరుకోగా, ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.65 శాతానికి, ఏడాది రుణాలపై రేటు 8.85 శాతానికి సవరించింది. ఈ నూతన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు, దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్..రెపోతో అనుసంధానమైన గృహ రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్ల నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. దీంతో గృహ రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం నుంచి 9.8 శాతం మధ్యలోకి చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

