ఆకట్టుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,579 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,853 కోట్ల కంటే 19 శాతం అధికంగా నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది.
- మూడో త్రైమాసికంలో రూ.4,579 కోట్ల లాభం
న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,579 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,853 కోట్ల కంటే 19 శాతం అధికంగా నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఏడాది క్రితం రూ.27, 092 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదా యం గత త్రైమాసికంలో రూ.31,416 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.23,540 కోట్ల నుంచి రూ.28,605 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.53 శాతం నుంచి 3.08 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.99 శాతం నుంచి 0.70 శాతానికి దిగొచ్చినట్లు పేర్కొంది. మరోవైపు, బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 14.93 శాతం నుంచి 14.72 శాతానికి తగ్గింది. గత త్రైమాసికంలో బ్యాంక్ మొండి బకాయిలను పూడ్చుకోవడానికి కేవలం రూ.50.49 కోట్ల నిధులు మాత్రమే వెచ్చించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bank of baroda
- banking news
- BOB
- BSE
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

