ముంబై, జూలై 25 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,541 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,458 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 1.9 శాతం వృద్ధిని కనబరిచింది.
బ్యాంక్ ఆపరేటింగ్ మార్జిన్ ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎగబాకి రూ.8,236 కోట్లకు చేరుకున్నది. అయినప్పటికీ బ్యాంక్‌నకు వడ్డీల మీద వచ్చే ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.11,435 కోట్లకు పరిమితమైంది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.88 శాతం నుంచి 2.28 శాతానికి దిగొరాగా, నికర ఎన్పీఏ 0.60 శాతంగా నమోదైంది.