Bank of Baroda | విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ కొత్త సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ప్రారంభించింది. బీఆర్ఓ సేవింగ్స్ అకౌంట్ పేరుతో ప్రారంభించిన ఈ ఖాతాను 18-25 ఏండ్ల మధ్య వయస్కులు తెరవొచ్చునని పేర్కొంది. కనీస బ్యాలెన్స్ లేకుండానే విద్యార్థులు ఈ ఖాతాతో బ్యాంకింగ్ సేవలు పొందవచ్చునని బ్యాంక్ ఆఫ్ బరోడా సీజీఎం రవీంద్ర సింగ్ నేగి చెప్పారు.
సంబంధిత ఖాతాదారుల అర్హతకు అనుగుణంగా లైఫ్ టైం ఫ్రీ రూపే ప్లాటినం డెబిట్ కార్డును బ్యాంక్ ఆఫ్ బరోడా అందజేస్తుంది. ప్రతి మూడు నెలలకు రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంటది. ఈ ఖాతాదారులకు రూ.2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ అందిస్తున్నది. ఫ్రీ చెక్ లీవ్స్, ఫ్రీ ఎస్ఎంఎస్ లు, ఈ-మెయిల్ అలర్ట్స్ ఇస్తారు. ఇక ఈ ఖాతాదారులు డీమ్యాట్ ఖాతా ప్రారంభిస్తే, వార్షిక మెయింటెనెన్స్ చార్జీలు పూర్తిగా మాఫీ చేస్తారు. విద్యా రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీపై రాయితీ అందిస్తుంది. ఖాతాదారుల అర్హత ఆధారంగా స్పెషల్ క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా అందిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా.