Bank Holidays in November | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు జరుపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. అయితే, ఆయా బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. కనుక మీరు మీ బ్యాంకు శాఖకు వెళ్లే ముందు ఆయా బ్యాంకులకు సెలవులు ఉన్నాయా.. లేదా.. అన్న విషయం చెక్ చేసుకున్నాక వెళితే బెటర్.
ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం వచ్చే నెలలో అంటే నవంబర్‌లో మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు. వాటిలో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. ఇక పండుగలు, ఇతర పర్వదినాలతో దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో 17 రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే, రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఆయా తేదీల్లో బ్యాంకులు పని చేయవు.
ఉదాహరణకు కన్నడ రాజ్యోత్సవ దినోత్సవం నాడు కర్ణాటకలో, ఛత్‌పూజ సందర్భంగా బీహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో పని చేసే బ్యాంకులకు సెలవులు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆదివారాలు, రెండో/ నాలుగో శనివారాలతో కలిపి దీపావళి, గురునానక్ జయంతి/కార్తిక పూర్ణిమ సందర్భంగా బ్యాంకులకు సెలవులు. అంటే తెలుగు రాష్ట్రాల్లో సాధారణ సెలవులతో కలిపి ఎనిమిది రోజులు సెలవులు వస్తాయి. కనుక ఖాతాదారులు తమ పనులను, ఆయా తేదీలను బట్టి బ్యాంకింగ్ లావాదేవీలకు ప్లాన్ చేసుకోవడం బెటర్‌గా ఉంటుందని చెబుతున్నారు.
నవంబర్‌లో సెలవుల జాబితా ఇదే..
నవంబర్ 1.. కన్నడ రాజ్యోత్సవ
నవంబర్ 3.. నరక చతుర్థి
నవంబర్ 4 .. దీపావళి
నవంబర్ 5.. దీపావళి (బాలిప్రతిపద.. విక్రం సంవాంత్ నూతన సంవత్సరం.. గోవర్ధన్ పూజ)
నవంబర్ 6.. భాయిదుజ్.. చిత్రగుప్త్ జయంతి.. లక్ష్మీ పూజ.. దీపావళి.. నింగోల్ చాక్కౌబ
నవంబర్ 10.. ఛాత్ పూజ (శయన్ ఆర్థ్య)
నవంబర్ 11.. ఛాత్ పూజ
నవంబర్ 12.. వంగాల ఫెస్టివల్
నవంబర్ 19.. కార్తికపూర్ణిమ/ గురునానక్ జయంతి
నవంబర్ 22.. కనకదాస జయంతి
నవంబర్ 23.. సెంగ్ కుట్స్నీం
వివిధ పర్వదినాలతోపాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు పని చేయవు.
నవంబర్ 7.. ఆదివారం
నవంబర్ 13.. రెండో శనివారం
నవంబర్ 14.. ఆదివారం
నవంబర్ 21.. ఆదివారం
నవంబర్ 27.. నాలుగో శనివారం
నవంబర్ 28.. ఆదివారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
28 నుంచి ప్లిఫ్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ : ఐఫోన్ 12, షియోమి ఫోన్లపై భారీ ఆఫర్లు!
EPFO Balance | పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
Tax on Gratuity | గ్రాట్యుటీ మీద పన్ను ఉంటుందా?
Fuel Price Hike | 2020 మే నుంచి పెట్రోల్, డీజిల్ ధరలెలా పెరిగాయంటే!
పెట్రోల్, డీజిల్ ధరలపై ‘శతాబ్ది ఉత్సవాలు జరుపుకోండి’.. కేంద్రానికి చిదంబరం చురకలు