KTR | 1000 రోజుల దగాపై నేడు చార్జ్‌షీట్.. విడుదల చేయనున్న కేటీఆర్
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనున్నది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుం డా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్ వేయనున్నది.
KTR | అటకెక్కిన ఆరు గ్యారెంటీలు.. ఎగవేసిన హామీలు.. అతీగతీ లేని డిక్లరేషన్లు.. మాటమార్చిన మ్యానిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్.. ఏరుదాటాక తెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా, పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. కాంగ్రెస్ పాలనకు నేటితో వెయ్యిరోజులు! ఈ దగాపాలనపై బీఆర్ఎస్ పోరుబాట చేపట్టనున్నది. ధోకేబాజ్ కాంగ్రెస్ వంచనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనున్నది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుం డా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్ వేయనున్నది. బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నారు. చార్జ్షీట్తోపాటు 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును ప్రశ్ని స్తూ ఈ నెల 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సేన సిద్ధమైంది.
చార్జ్‌షీట్‌తో మొదలయ్యే ఈ పోరాటాన్ని ప్రజాఉద్యమంగా మార్చాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. బుధవారం నుంచి ధర్నాలు, రైతు సదస్సులు, వంటావార్పులు, యువత ర్యాలీలు, ఆటో ర్యాలీలు, ప్ర జావాణి వినతిపత్రాలు.. ఇలా ప్రతిరోజూ ఒకో అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టేలా బీఆర్ఎస్ కార్యాచరణను సిద్ధం చే సింది. ఈ మేరకు మాజీ మంత్రులు, రాష్ట్ర నేతలు ఎక్కడికక్కడ పార్టీ సన్నాహక సమావేశాల ద్వారా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
- దేవుండ్ల సాక్షిగా ఒట్లు వేసి గ్యారెంటీ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు.. వాటి అమల్లో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. వం ద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారని, కానీ వెయ్యి రోజులవుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ‘వెయ్యి రోజులు.. వెయ్యి అబద్ధా లు’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై కాంగ్రెస్ బాకీ కార్డులకు మంగళవారం వేముల పూజలు చేసి విడుదల చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గంలో నిరసనలు ఉధృతం చేస్తామని తెలిపారు.
- బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా కాంగ్రె స్ 1000 రోజుల పాలనా వైఫల్యాలను వి వరిస్తూ గ్రామాల్లో ఫ్లెక్సీలు వెలుస్తున్నా యి. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మం డలం ఉప్లూర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
- కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో సంక్షేమం మాయమై.. విధ్వంస పాలన సాగుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం వనపర్తి బీఆర్ఎస్ భవనంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమరభేరి మోగించనున్నట్టు తెలిపారు. 6 గ్యారెంటీలు, 420 హామీ లు, 11 డిక్లరేషన్లు అమలు చేసే దాకా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. .
- రేవంత్ సర్కార్ ఒక్క హామీ కూడా అమ లు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. రేవంత్ పాలనలో వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగట్టేందుకు బుధవారం నుంచి వారం నిరసనలుంటాయని తెలిపారు.
- హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎగ్గొట్టిన హామీలపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

