Bank Holidays | కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల (Bank Holidays ) జాబితాను ముందుగానే జారీ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే సెప్టెంబర్ (September) నెలకు సంబంధించిన సెలవుల జాబితా కూడా తాజాగా విడుదలైంది. కాగా, ఆ నెలలో పండుగలు, వారాంతాలతో కలిపి సగం రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఆర్బీఐ (RBI) సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్ గా ఉంటాయి.
ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం.. సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా..
సెప్టెంబర్ 3 (బుధవారం) : కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సెలవు.
సెప్టెంబర్ 4 (గురువారం) : కేరళలో ఓనం మొదటి రోజు సందర్భంగా హాలిడే
సెప్టెంబర్ 5 (శుక్రవారం) : మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూ ఢిల్లీ, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 6 (శనివారం): ఇంద్రజాత్ర సందర్భంగా సిక్కిం, జమ్ము, రాయ్పూర్, శ్రీనగర్లో బ్యాంకులు పనిచేయవు.
సెప్టెంబర్ 7 : ఆదివారం
సెప్టెంబర్ 12 (శుక్రవారం) : ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
సెప్టెంబర్ 13 : రెండో శనివారం
సెప్టెంబర్ 14 : ఆదివారం
సెప్టెంబర్ 21 : ఆదివారం
సెప్టెంబర్ 22 (సోమవారం) : నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్లో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 23 (మంగళవారం) : మహారాజా హరి సింగ్ జీ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్ము, శ్రీనగర్లో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 27 : నాలుగో శనివారం
సెప్టెంబర్ 28 : ఆదివారం
సెప్టెంబర్ 29 (సోమవారం) : మహా సప్తమి/దుర్గాపూజ సందర్భంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 30 (మంగళవారం) : మహా అష్టమి / దుర్గాష్టమి / దుర్గా పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
Also Read..
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్లో 50 ఆయుధాలు కూడా వాడలేదు : ఐఏఎఫ్ అధికారి
Cloudburst | ఉత్తరాది రాష్ట్రాల్లో జలవిలయం.. షాకింగ్ వీడియోలు
RCB | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ కీలక ప్రకటన