న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. వారానికి ఐదు రోజుల పని, అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలతోపాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మార్చి 24 నుంచి రెండు రోజులపాటు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెలో 9 బ్యాంకింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉద్యోగులు పాల్గొంటున్నారని యూఎఫ్బీయూ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఇన్సెంటీవ్లు ఇచ్చే ప్రతిపాదనను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) సూచనలను వెంటనే విరమించుకోవాలని, దీంతో ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిళ్లనున్నదని, అలాగే సిబ్బంది మధ్య విభజనకు దారితీసే ప్రమాదం ఉన్నదని యూఎఫ్బీయూ డిమాండ్ చేస్తున్నది.