Cash Withdrawal Limit | ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ చెల్లింపులో జోరుగా సాగుతున్నాయి. టీ దుకాణాల నుంచి బడా షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. యూపీఐ లావాదేవీలు జీవితంలో భాగంగా మారాయి. యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఫీజులు లేకపోవడంతో జోరుగా సాగుతున్నాయి. ఈ యూపీఐ లావాదేవీలు రోజువారీ జీవితాన్ని సులభతరం చేశాయి. దాంతో డబ్బును వేగంగా పంపడంతో పాటు తీసుకుకోవడం సాధ్యమవుతున్నది. అయినా, నేటికీ పలు నగరాలు, పట్టణాల్లో జనం ఇంకా ఆన్లైన్ చెల్లింపుల కంటే నగదు చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు అవసరమైతే నగదును తీసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలను ఆశ్రయిస్తుంటారు. అయితే, నగదు అవసరమైతే నెలకు ఎన్నిసార్లు తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా? అనే అనుమానాలు కలుగుతుంటాయి.
వాస్తవానికి ప్రతీ బ్యాంకుకు దాని సొంత పరిమితులను నిర్దేశిస్తుంటాయి. బ్యాంకులు కొన్ని లావాదేవీలు ఉచితంగా అందిస్తాయి. ఆ తర్వాత ప్రతి విత్‌డ్రాకు ఛార్జీలు విస్తాయి. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతా ఉంటే.. సాధారణంగా మూడు నుంచి ఐదుసార్లు ఉచితంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అనంతరం ప్రతి లావాదేవీకి రూ.10 నుంచి రూ.20 వరకు ఛార్జీలు విధిస్తారు. ఈ పరిమితి ఏటీఎంలకు సైతం వర్తిస్తుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్లకు ఐదుసార్లు ఉచిత నగదు ఉపసంహరణకు అవకాశం ఇస్తుంది. అయితే, మీరు మీ బ్యాంకు ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకుంటే ఈ పరిమితి దాటిన తర్వాత ఛార్జీలు ఎక్కువగా విధిస్తాయి.
ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా చార్జీ విధిస్తుంటాయి. నగరం, పట్టణాన్ని బట్టి ఈ రూల్స్ మారుతూ వస్తుంటాయి. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోని ఏటీఎంల లావాదేవీ పరిమితులు తక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో, బ్యాంకులు కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తాయి. కాబట్టి వారు నగదు తీసుకునే ప్రతిసారీ పట్టణానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది గ్రామీణ వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది. నగదు ఉపసంహరణ పరిమితులు ఏటీఎంలకు మాత్రమే కాకుండా బ్యాంకు శాఖలకు వర్తిస్తాయి. కొన్ని బ్యాంకులు నెలకు మూడు ఉచిత కౌంటర్ ఉపసంహరణలను అనుమతి ఇస్తున్నాయి. ఆ తర్వాత సర్వీస్ చార్జీలు వర్తింపజేస్తాయి. ఇది ప్రతి బ్యాంకు నియమాల ప్రకారం మారుతూ వస్తుంది. మొత్తం నగదు, నగదు ఉపసంహరణ పరిమితి, బ్యాంక్, అకౌంట్ వేరియంట్ బట్టి మారుతుంది.