న్యూఢిల్లీ, జనవరి 17: బజాజ్ పల్సర్ కొనుగోలుదారులకు షాకిచ్చింది సంస్థ. పల్సర్ బైకుల ధరలను రూ.461 నుంచి రూ.1,460 వరకు పెంచింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ఎంపిక చేసిన పల్సర్ బైకుల ధరలను సవరించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
కంపెనీ మొత్తం విక్రయాల్లో 60 శాతం వాటా కలిగిన పల్సర్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపదని, సంస్థపై అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలను స్వల్పంగా పెంచినట్టు తెలిపారు. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో బజాజ్ పల్సర్ 125 సీసీ బైకు ఎంట్రీ లెవల్ మాడల్ రూ.778 నుంచి రూ.1,020 వరకు సవరించింది. అలాగే నియాన్ సింగిల్ సీటు రకంను రూ.891 పెంచింది.