హైదరాబాద్, మార్చి 12: రాష్ర్టానికి చెందిన కాంప్లెక్స్ విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్.. హైదరాబాద్‌కు సమీపంలోని తునికి బొల్లారం వద్ద లీన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం ప్రత్యేకంగా ఈ యూనిట్‌ను నెలకొల్పింది.
7,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ప్రస్తుతం 200 మంది ప్రతిభ కలిగిన ఉద్యోగులు పనిచేస్తున్నారని, త్వరలో మరింత మందిని నియమించుకోనున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ చైర్మన్, సీఈవో రాకేశ్ చోప్దార్ తెలిపారు. నాణ్యత, సృజనాత్మకత, ఖచ్చితమైన ఇంజినీరింగ్ పట్ల మా అచంచలమైన నిబద్ధతకు ఈ యూనిట్ మైలురాయిగా నిలువనున్నదన్నారు.