హైదరాబాద్, ఏప్రిల్ 29: ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ మరో మైలురాయిని సాధించింది. హైదరాబాద్‌లోని తునికిబొల్లారం వద్ద లీన్ తయారీ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా జీఈ వెర్నోవా స్టీమ్ పవర్ సర్వీసెస్‌తో కలిసి ఈ యూనిట్‌ను నెలకొల్పినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో వరల్డ్-క్లాస్ తయారీ సెంటర్‌గా తీర్చిదిద్దినట్టు, అంతర్జాతీయంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ రంగాలకు చెందిన గ్లోబల్ సంస్థలకు సరఫరా చేయడానికి వీలు పడనున్నదని పేర్కొన్నారు.