Ram Mandir- Spice Jet | అందరినీ అబ్బురపరిచేలా అయోధ్యలో రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు ప్రముఖులు మొదలు సాధారణ భారతీయుడి వరకూ ఈ వేడుకను కండ్లారా వీక్షించారు. ఇక నుంచి అయోధ్య ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తున్న తరుణంలో ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’ ఆకర్షణీయ ఆఫర్ తీసుకొచ్చింది. అయోధ్యకు వెళ్లే వారు రూ.1622 పే చేస్తే చాలు ‘స్పైస్ జెట్’ విమానంలో వెళ్లి రావచ్చు. అంతే కాదు దేశీయంగా, అంతర్జాతీయంగానూ నాన్-స్టాప్ విమాన సర్వీసులు నడుపనున్నట్లు సోమవారం ప్రకటించింది. అయోధ్యకు వెళ్లదలుచుకున్న వారు ఫ్రీ డేట్ చేంజ్ ఆఫర్‌తోపాటు తమకు ఆమోదయోగ్యమైన తేదీకి మార్చుకోవచ్చునని స్పైస్ జెట్ వెబ్ సైట్ తెలిపింది.
ఇందుకోసం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి దేశంలోని ప్రముఖ నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభిస్తుంది. చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, పాట్నా, దర్భంగ నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి.
ఈ నెల 22 నుంచి 28 వరకు బుక్ చేసుకున్న వారికే ఆఫర్ వర్తింపు
ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణించవచ్చు.
ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ రూట్లలో డైరెక్ట్ వన్ వే ఫ్లైట్
ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ డ్ బేసిస్ ఆఫర్. పరిమిత సీట్లు మాత్రమే లభ్యం
స్పెషల్ టికెట్ ధరలపై రాయితీలు వర్తించవు.
గ్రూప్ బుకింగ్స్‌కు కూడా ఆఫర్ వర్తించదు.
బుకింగ్స్‌పై చార్జీలు రీఫండబుల్, క్యాన్సిలేషన్ చార్జీలు వర్తిస్తాయి.
రెగ్యులేటరీ సంస్థల ఆమోదాన్ని బట్టి ఫ్లయిట్ షెడ్యూల్ ఖరారు.
స్పైస్ జెట్ వెబ్ సైట్, మొబైల్ యాప్, రిజర్వేషన్స్, ఎయిర్ పోర్ట్ టికెటింగ్ కౌంటర్, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్స్ చెల్లుబాటు.
విమానం ప్రయాణానికి 96 గంటల ముందు బుకింగ్స్, టికెట్ మార్పిడిపై ఫీజు మాఫీ. టికెట్ మార్పిడిపై ఫీజు మాఫీ ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు.