హైదరాబాద్, మార్చి 31: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) ప్లాట్‌ఫాంపై బీఎల్డీసీ టెక్నాలజీ సంస్థ హవా పేరుతో ప్రత్యేక ఫ్యాన్లను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది హైదరాబాద్‌కు చెందిన అవాన్స్ ఫ్యూచర్ లిమిటెడ్ సంస్థ. రిమోట్ ద్వారా ఫ్యాన్ వేగాన్ని నియంత్రించడంతోపాటు రివర్స్‌లోనూ సైతం ఈ ఫ్యాన్లు తిరగడం వీటి ప్రత్యేకత. మేడిన్ తెలంగాణ బ్రాండ్‌గా ఐవోటీ టెక్నాలజీపై వచ్చిన తొలి ఫ్యాన్ ఇదేనని కంపెనీ డైరెక్టర్ అనిల్ తెలిపారు. అలెక్సా, వై-ఫై టెక్నాలజీతో తయారవనున్న ఫ్యాన్లను త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. దక్షిణాది మార్కెట్లో వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న ఈ యూనిట్‌తో 150 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీలో ఉన్న ప్లాంట్‌తోపాటు హైదరాబాద్ యూనిట్ అందుబాటులోకి వస్తే ఫ్యాన్ల ఉత్పత్తి సామర్థ్యం లక్ష యూనిట్లకు చేరుకోనున్నది. మూడు రకాల్లో లభించనున్న ఈ ఫ్యాన్ల ప్రారంభ ధర రూ.4 వేలుగా నిర్ణయించింది.
ఇవీ కూడా చదవండి
శరీరానికి సరిపడా సీ విటమిన్ కావాలంటే.. వీటిని తినండి