న్యూఢిల్లీ, మార్చి 4: ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో..తాజాగా ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. గోగో బ్రాండ్‌తో సరికొత్త ఆటోలను మార్కెట్‌కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 251 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. రెండు రకాల్లో లభించనున్న ఈ ఆటోల్లో గోగో పీ5009 రకం ధర రూ.3,26,797 గాను, పీ7012 ధర రూ.3,93,004గా నిర్ణయించింది. బ్యాటరీపై సంస్థ ఐదేండ్లపాటు వ్యారంటీ కల్పించింది.