న్యూఢిల్లీ, డిసెంబర్ 13: హిందుజా గ్రూపునకు చెందిన ఆటోమొబైల్ సంస్థ అశోక్ లేలాండ్..కమర్షియల్ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
కమోడిటీ ధరలు భగ్గుమనడం, ద్రవ్యోల్బణం కారణంగా సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వచ్చే నెల నుంచి కమర్షియల్ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది.