Auto Sales | న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయంగా వాహన అమ్మకాలు క్రితంతో పోల్చితే గత నెలలో పడిపోయాయి. ప్రధాన సంస్థలైన మారుతీ సుజుకీ, టాటా మోటర్స్, హ్యుందాయ్ విక్రయాల్లో క్షీణత నమోదైంది. జూలైలో మారుతీ 9.64 శాతం, టాటా 11 శాతం, హ్యుందాయ్ 3 శాతం మేర తక్కువ సేల్స్‌ను చూశాయి.
మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీకి చెందిన ఎవర్గ్రీన్ మాడల్ ఆల్టోతోపాటు, ఎస్-ప్రెస్సో మాడళ్లకు కొనుగోళ్ల మద్దతు లభించినా.. పాపులర్ మాడల్స్ బాలెనో, సెలీరియో, డిజైర్, స్విఫ్ట్, వాగనార్లకు ఆదరణ తగ్గింది. యుటిలిటీ వెహికిల్స్ బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా, జిమ్నీ అమ్మకాలూ అంతంతే ఉండటం గమనార్హం. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, టయోట, కియా అమ్మకాలు పెరిగాయి. టూవీలర్ సేల్స్‌లోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి.