హైదరాబాద్, సెప్టెంబర్ 18: అరబిందో ఫార్మా మరో ఔషధ సంస్థను కొనుగోలు చేసింది. ఇప్పటికే జీఎల్ఎస్ ఫార్మా లిమిటెడ్లో 51 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ..తాజాగా మరో 49 శాతం వాటాను చేజిక్కించుకున్నది.
ఇందుకోసం రూ.22.5 కోట్ల నిధులు వెచ్చించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఇరు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. రూ.10 విలువ కలిగిన ప్రమోటర్లకు చెందిన 5,90,361 షేర్లను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం డిసెంబర్ 31 నాటికి పూర్తికాగలదు.