హైదరాబాద్, జూలై 15: అరబిందో ఫార్మా.. హెచ్ఐవీని నియంత్రించే ఔషధాన్ని విడుదల చేయబోతున్నది. ఇందుకు సంబంధించి మెడిసిన్స్ పెటెంట్ పూల్, వివ్ హెల్త్కేర్లతో వాలంటరీ లైసెన్సింగ్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకున్నది.
ఈ ఔషధాన్ని తయారు చేయడంతోపాటు 133 దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నది. ప్రస్తుతం హెచ్ఐవీ చికిత్స కోసం వినియోగిస్తున్న క్యాబోటెగ్రావీర్కు జనరిక్ వెర్షన్‌గా ఈ ఔషధాన్ని రూపొందిస్తున్నది.