హైదరాబాద్, ఫిబ్రవరి 6: అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.846 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని మాత్రమే గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.940 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.7,352 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.7,979 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.