హైదరాబాద్, జూలై 18: ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మారూ.750 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నది. ఇందుకుగాను కంపెనీ బోర్డు సమావేశమై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేరుకు రూ.1,460 చొప్పున 51,36,986 షేర్లను బైబ్యాక్ చేయనుండటంతో 0.88 శాతం వాటా పెరగనున్నది.
ప్రస్తుతం సంస్థలో ప్రమోటర్లకు 51.8 శాతం వాటా ఉండగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 16.73 శాతం, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు 19.17 శాతం వాటా ఉన్నది.