న్యూఢిల్లీ, మే 2: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా మరోసారి ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను రెండు శాతం వరకు సవరిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు ఎక్సేంజ్ రేట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.