ముంబై, ఫిబ్రవరి 17: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్ఎస్ క్యూ8 పేరుతో విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధరూ.2.49 కోట్లు. 4 లీటర్ల వీ8 టీఎఫ్ఎస్ఐ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు కేవలం 3.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. టాప్‌స్పీడ్ 305 కిలోమీటర్లు. హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్, భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేసింది.