Audi Q5 Bold | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా (Audi India) తన ఎస్యూవీ కారు క్యూ5 బోల్డ్ (Q5 Bold)ను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. దీని ధర రూ.72.30 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. పరిమిత సంఖ్యలోనే ఈ కార్లు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి కల వారు సమీప ఆడీ డీలర్లను సంప్రదించాలని ఆడీ ఇండియా సూచించింది. ఇంతకుముందే క్యూ3 బోల్డ్(Q3 Bold), క్యూ7 బోల్డ్ (Q7 Bold) ఎస్యూవీ కార్లను ఆడీ ఇండియా ఆవిష్కరించింది. క్యూ3 బోల్డ్, క్యూ7 బోల్డ్ కార్లతో పోలిస్తే ఆడీ క్యూ5 బోల్డ్ (Audi Q5 Bold) ఎడిషన్ కారు రూ.1.5 లక్షలు పిరం. క్యూ3, క్యూ7 బోల్డ్ ఎడిషన్ కార్లతో పోలిస్తే క్యూ5 బోల్డ్ కారులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. బోల్డ్, స్టైలిష్ డిజైన్ తో వస్తోంది.
ఆడీ క్యూ5 బోల్డ్ ఎడిషన్ (Audi Q5 Bold Edition) బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ, బోల్డ్ తోపాటు యాస్థెటికల్ అప్పీల్, గ్రిల్లె, ఆడీ ఎంబ్లమ్స్ (ఫ్రంట్ అండ్ రేర్), విండో సరౌండ్స్, ఎక్స్ టీరియర్ మిర్రర్ రూఫ్ రెయిల్స్ వంటి భాగాలపై స్లీక్, హైగ్లాస్ బ్లాక్ ఫినిష్ ఉంటుంది. ఫైవ్ ఐ-క్యాచింగ్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లు – గ్లాసియర్ వైట్, నవర్రా బ్లూ, మైథోస్ బ్లాక్, డిస్ట్రిక్ట్ గ్రీన్, మ్యాన్ హట్టన్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
2.0 లీటర్ల టీఎఫ్ఎస్ఐ ఇంజిన్ తో వస్తోంది ఆడీ క్యూ5 బోల్డ్ ఎడిషన్ కారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 265 హెచ్‌పీ విద్యుత్ 370 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం 6.1 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. గరిష్టంగా గంటకు 240 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. క్వాట్ట్రో ఆల్ వీల్ డ్రైవ్, ఆడి స్పోర్ట్ 5- ఆర్మ్ పైలాన్ స్టైల్ వీల్స్, డ్యాంపర్ కంట్రోల్‌తో సస్పెన్షన్ సిస్టమ్ ఉంటది.
ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పనోరమిక్ సన్ రూఫ్, కంఫర్ట్ కీ ఫర్ కీలెస్ ఎంట్రీ, ఆడీ వర్చువల్ కాక్ పిట్ ప్లస్, ఎంఎంఐ నేవిగేషన్ ప్లస్ విత్ ఎంఎంఐ టచ్ రెస్సాన్స్, ఇమ్మర్సివ్ 3డీ ఆడియో కోసం బీ&ఓ ప్రీమియం సౌండ్ సిస్టమ్స్ విత్ 19 స్పీకర్స్, 8 ఎయిర్ బ్యాగ్స్ తో సేఫ్టీ, కన్వియెన్స్ కోసం పార్క్ అసిస్ట్ విత్ 360 డిగ్రీ కెమెరా, ఆడీ స్మార్ట్ ఫోన్ ఇంటర్ ఫేస్ తదితర ఫీచర్లు జత కలిపారు. లగ్జరీగా ఉండే ఈ కారును ప్రాక్టికాలిటీకి అనుగునంగా డిజైన్ చేశారు. అట్లాస్ బీగ్, ఒకాపీ బ్రౌన్ లెదరట్టే అప్హోల్స్టరీ విత్ పియానో బ్లాక్ ఇన్ లేస్, అంబియెంట్ లైటింగ్ కస్టమైజబుల్ ఇన్ 30 కలర్స్, ఆడీ ఫోన్ బాక్స్ విత్ వైర్ లెస్ చార్జింగ్, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, ఆడీ జెన్యూన్ యాక్సెసరీస్ జత చేశారు.