Audi India | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) తన న్యూ క్యూ8 ఈ-ట్రాన్ (Q8 e-tron), క్యూ8 స్పోర్ట్ బ్యాక్ ఈ-ట్రాన్ (Q8 Sportbak e-tron) మోడల్ కార్ల బుకింగ్స్ ప్రారంభించింది. క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్ బ్యాక్ ఈ-ట్రాన్ కార్లు న్యూ డిజైన్ లగేజ్, ఫీచర్లతోపాటు పెంపొందించిన బ్యాటరీ కెపాసిటీ, డ్రైవింగ్ రేంజ్, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్‌తో వస్తున్నాయి. ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ కార్లు సింగిల్ చార్జింగ్‌తో 600 కి.మీ దూరం ప్రయాణించే కెపాసిటీ కలిగి ఉంటాయి. ఈ రెండు కార్లు రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ స్పందిస్తూ ‘ కొన్ని రోజుల క్రితమే క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్ బ్యాక్ ఈ-ట్రాన్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆవిష్కరించాం. గ్లోబల్ మార్కెట్లలో కొన్ని నెలల క్రితం ఆవిష్కరించాం. గ్లోబల్ సైకిల్ లో భాగంగా భారత్ భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాం’ అని తెలిపారు.