Asus ROG Phone 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్ (Asus) తన గేమింగ్ స్మార్ట్ ఫోన్.. ‘అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్’ ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. ఈ సిరీస్ ఫోన్లలో అసుస్ రోగ్ ఫోన్8, అసుస్ రోగ్ ఫోన్8 ప్రో ఉన్నాయి. రెండూ వేరియంట్లూ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంటాయి. ప్రతి మోడల్ ఫోన్ కూడా రెండు స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ప్రపంచంలోకెల్లా శరవేగంగా పని చేసే స్మార్ట్ ఫోన్‌గా నిలుస్తుందంటూ అసుస్ ప్రకటించుకున్నది.
అసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో వేరియంట్ 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ ధర, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ ఆప్షన్లతో వస్తున్నది. ఈ ఫోన్ ధర రూ.94,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక బేస్ వేరియంట్ అసుస్ రోగ్ ఫోన్8 ఫోన్ కూడా 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.91,500 నుంచి ప్రారంభం అవుతుంది.
రెండు ఫోన్లూ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఎల్టీపీఓ డిస్ ప్లే కలిగి ఉంటాయి. గరిష్టంగా 2500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటది. రెండు ఫోన్లలోనూ ట్రిపుల్ రేర్ కెమెరా (50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 32-మెగా పిక్సెల్ సెన్సర్, 13 మెగా పిక్సెల్స్ సెన్సర్) సెటప్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా కూడా జత చేశారు.
అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ ఫోన్లను రెండు వేర్వేరు స్టోరేజీ ఆప్షన్లలో ఆవిష్కరించింది. అసుస్ రోగ్ ఫోన్ 8 ఫోన్ 12 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుంది. టాప్ వేరియంట్ అసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో వేరియంట్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ, 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్స్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటాయి.
రెండు మోడల్ ఫోన్లలోనూ 65 వాట్ల చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. మెరుగైన గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రోగ్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)పై పని చేస్తుందీ ఫోన్. 5జీ, 4జీ, 3జీ, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.4, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వై-ఫై6, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంది.