హైదరాబాద్, జనవరి 26: దేశంలో అతిపెద్ద పెయింట్స్ సంస్థల్లో ఒకటైన ఏషియన్ పెయింట్స్..తాజాగా తెలంగాణలో తన తొలి ప్రీమియం బ్యూటిఫుల్ హోమ్ షోరూంను ప్రారంభించింది. 5,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంను కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సైంజల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కంపెనీకి సం బంధించిన అన్ని రకాల ఉత్పత్తులను ఒకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఈ అతిపెద్ద అవుట్‌లెట్‌ను ప్రారంభించినట్టు, ముఖ్యంగా ఫర్నీచర్, లైట్స్, ఫ్యాబ్రిక్, మాడ్యులర్ కిచెన్, డెకరేషన్‌కు సంబంధించిన ఉత్పత్తులను ఇక్కడ పదర్శిస్తున్నట్లు చెప్పారు.