న్యూఢిల్లీ, జూన్ 27: టక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అశోక్ వాశ్వాని తన పదవి నుంచి వైదొలుగబోతున్నారు. మూడేండ్ల కాలపరిమితి డిసెంబర్ 31, 2026న ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశాలు లేకపోవడం ఇందుకు కారణం. వెటరన్ బ్యాంక్ వైశ్వాని..కొటక్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా జనవరి 1, 2024లో నియమితులయ్యారు. గతంలో ఆయన బార్లెస్, సిటీగ్రూపుల్లో విధులు నిర్వహించారు. ఆయన వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నారని, ఆయన మరోదఫా పొడిగించాలని కోరడం లేదని బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ సుప్రీం ఉదయ్ కొటక్ అకస్మాత్తుగా తన పదవీకి రాజీనామా చేయడంతో అప్పట్లో బ్యాంక్ మధ్యంతర ఎండీ, సీఈవోగా దీపక్ గుప్తా నియమితులయ్యారు.