హైదరాబాద్, ఏప్రిల్ 26: అశోక్ లేలాండ్ రాష్ట్రంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా కంపెనీకి చెందిన లైట్ కమర్షియల్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తాజాగా నిజామాబాద్‌లో తన తొలి షోరూంను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో సంస్థ ఏర్పాటు చేసిన నాలుగో షోరూం ఇదేనని అశోక్ లేలాండ్ ఎల్సీవీ బిజినెస్ హెడ్ విప్లవ్ షా తెలిపారు.
ఈ షోరూంలో సేల్స్, సర్వీసెస్, విడిభాగాలు కూడా లభించనున్నాయి. ప్రస్తుతం సంస్థ ఎల్సీవీ విభాగంలో నాలుగు మాడళ్లను విక్రయిస్తున్నది. వీటిలో రూ.6.56 లక్షలు మొదలుకొని రూ.26.50 లక్షల గరిష్ఠ స్థాయిలో వీటిని విక్రయిస్తున్నది.