హైదరాబాద్, జూన్ 11: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్బీఎల్..హైదరాబాద్‌లో మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఐదు ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుక రెరా ఆమోదం లభించింది. 2035 నుంచి 2650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయతలపెట్టిన మూడు టవర్‌లో 885 విలాసవంతమైన 3బీహెచ్‌కే ఫ్లాట్లను నిర్మిస్తున్నట్టు కంపెనీ ఎండీ, ఫౌండర్ అజితేష్ ఈ సందర్భంగా తెలిపారు.
రూ.400 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి దశ డిసెంబర్ 2029 నాటికి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఈ ప్లాట్ల ప్రారంభ ధర రూ.2.5 కోట్లుగా నిర్ణయించింది. అలాగే ఈ ప్రాజెక్టులోనే 100 సీట్ల సామర్థ్యంతో కో-వర్కింగ్ స్థలాన్ని కూడా నెలకొల్పబోతున్నది. గడిచిన ఏడాది రూ.1,200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..ఈ ఏడాది రూ.2,300 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. వచ్చే మూడు నుంచి ఐదేండ్లలో దక్షిణాదికి తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించారు.