NPCI- WhatsApp Pay | థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ వాట్సాప్ పే యాప్‌తో నగదు చెల్లింపులకు పరిమితులు ఎత్తేస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్ణయం తీసుకున్నది. దీంతో 10 కోట్ల మందికి మాత్రమే అందుబాటులో ఉన్న సేవలు ఇప్పుడు వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చాయి. గతంలో మెసేజ్‌లకే వాట్సాప్ పరిమితమయ్యేది. ప్రస్తుతం వాట్సాప్ సేవలను 50 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
తొలుత వాట్సాప్ పే ద్వారా పేమెంట్స్ సేవలు అందించడంపై ఎన్పీసీఐ ఆంక్షలు విధించింది. తొలుత 2020లో కేవలం నాలుగు కోట్ల మంది యూజర్లకు అవకాశం కల్పించిన ఎన్పీసీఐ.. 2022లో 10 కోట్ల మందికి పెంచింది. తాజాగా దీనిపై గల పరిమితులన్నీ ఎన్పీసీఐ ఎత్తేయడంతో వాట్సాప్ యూజర్లంతా పేమెంట్ సేవలు వినియోగించుకోవచ్చు.