UBS-Credit Suisse | అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ)తోపాటు స్వీడన్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ గత మార్చిలో సంక్షోభంలో చిక్కుకున్నది. స్వీడన్ ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో క్రెడిట్ సూయిస్ బ్యాంకును దాని ప్రత్యర్థి బ్యాంక్ యూబీఎస్ బ్యాంక్ టేకోవర్ చేసింది.
అధికారికంగా క్రెడిట్ సూయిజ్ బ్యాంకు టేకోవర్ సోమవారం పూర్తయిందని యూబీఎస్ బ్యాంక్ సీఈఓ సెర్జియో ఎర్మొట్టి ప్రకటించారు. దాంతోపాటు దాదాపు 10శాతం మంది క్రెడిట్ సూయిజ్ బ్యాంకు ఉద్యోగులు వైదొలిగారని స్విస్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ ఎస్ఆర్ఎఫ్కు ఎర్మొట్టి తెలిపారు. 1.6 లక్షల డాలర్ల బ్యాలన్స్ షీట్తో క్రెడిట్ సూయిజ్ బ్యాంకును యూబీఎస్ టేకోవర్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా రెండు బ్యాంకులకు కలిపి 1.20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. క్రెడిట్ సూయిజ్ బ్యాంకు టేకోవర్ ప్రక్రియ సమయంలోనే పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగుల కోత ఉంటుందని సంకేతాలిచ్చింది యూబీఎస్.
వైదొలిగిన వారిలో క్రెడిట్ సూయిజ్ బ్యాంకులో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ దీక్షిత్ జోషి, జనరల్ కౌన్సిల్ మార్కస్ డైథ్లెమ్ తదితరులు ఉన్నారు. ప్రతి రోజు సగటున 400 మందికి పైగా ఉద్యోగులు క్రెడిట్ సూయిజ్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తున్నది. మొత్తం సుమారు 5000 మంది ఉద్యోగులు క్రెడిట్ సూయిజ్ నుంచి తప్పుకున్నారు. సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూయిజ్ సంస్థను గత మార్చి 19న ప్రభుత్వ జోక్యంతో టేకోవర్ చేస్తున్నట్లు యూబీఎస్ ప్రకటించింది.