Apple – iPhone 16 |గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించనున్నదని సమాచారం. దేశంలో ఐ-ఫోన్ ప్రో సిరీస్ ఫోన్లను తొలిసారి అసెంబ్లింగ్ చేస్తున్నా.. వాటి విక్రయాల తేదీ త్వరలో వెల్లడిస్తామని ఆపిల్ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఐ-ఫోన్ 16 ఫోన్ విక్రయాలు ప్రారంభం అవుతాయని ఆపిల్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. అయితే భారత్ మార్కెట్లో ఐ-ఫోన్ ప్రో సిరీస్ ఫోన్ల లభ్యతపై మాత్రం ఆపిల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో గత వర్షన్ ఐ-ఫోన్ల కంటే ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.
‘ఐ-ఫోన్ 16 ప్రో ఫోన్ ధర రూ.1,19,900, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ ధర రూ.1,44,900 నుంచి ప్రారంభం అవుతుంది’ అని ఆపిల్ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది విడుదల చేసిన ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్ రూ.1,34,900, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ ధర రూ.1,59,900 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, ఒక టిగా బైట్ జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు 6.3 అంగుళాల, 6.9 అంగుళాల డిస్ ప్లేతో వస్తాయి.
అయితే, ఐ-ఫోన్ 16 ఫోన్, ఐ-ఫోన్ 16 ప్లస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ఆపిల్ తెలిపింది. ఐ-ఫోన్ 16 ఫోన్ రూ.79,900, ఐ-ఫోన్ 16 ప్లస్ ఫోన్ రూ.89,900లకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్లు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లిష్ వర్షన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చేనెలలో అందిస్తుంది.