Apple – iPhone 16 Pro | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. భారత్లో ఐ-ఫోన్ 16 ప్రో మోడల్ ఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ‘మేడిన్ ఇండియా’ ఐ-ఫోన్ 16 ప్రో మోడల్ ఫోన్లు.. ఆవిష్కరించిన తేదీ నుంచే గ్లోబల్ మార్కెట్లలో సేల్స్ ప్రారంభించిన నాడే భారత్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇది నిజమైతే దేశంలో ఐ-ఫోన్ల తయారీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటుందని సమాచారం. అలాగే, ఐ-ఫోన్లలో వాడే బ్యాటరీలనూ దేశీయంగా తయారు చేయాలని ఆపిల్ భావిస్తున్నది. అందుకోసం దేశీయ బ్యాటరీ తయారీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం తైవాన్ సంస్థలు ఫాక్స్ కాన్, పెగాట్రాన్, విస్ట్రన్ వంటి సంస్థలతో చైనాలో అత్యధిక మాన్యుఫాక్చరింగ్ ప్రక్రియ చేపట్టింది ఆపిల్. త్వరలో ఐ-ఫోన్ 16, ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తొలిసారి భారత్ లోనే తయారు చేయాలని సంల్పించినట్లు సమాచారం. మార్కెట్లో ఆవిష్కరించిన తర్వాత దేశీయంగా భారీ స్థాయిలో ఐ-ఫోన్లు తయారవుతాయి. గతేడాది ఐ-ఫోన్ 15 వర్షన్ ఫోన్లను భారత్ లోనే తయారు చేసి, ఆవిష్కరించి ఐ-ఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ఫోన్లను విక్రయించాలని భావిస్తున్నారు. తొలిసారి చైనా మార్కెట్ ఆవల ఆపిల్ తన ఐ-ఫోన్ ప్రో ఫోన్లు తయారు చేయడం ఇదే తొలిసారి.