IPhone 16 : ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ కానున్న ఐఫోన్ 16 సిరీస్‌లో కీలక డిజైన్ మార్పులకు యాపిల్ కసరత్తు సాగిస్తోందని చెబుతున్నారు. డయాగ్నల్ కెమెరా స్ధానంలో వర్టికల్ (నిలువు) కెమెరా లేఅవుట్‌ను తిరిగి ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎక్స్, 11లో మనం చూసే తరహా వర్టికల్ సెటప్‌ను యాపిల్ లేటెస్ట్ సిరీస్‌లో తీసుకురానున్నట్టు సమాచారం. వర్టికల్ కెమెరా అలైన్మెంట్ కేవలం స్టైలిష్ లుక్ కోసం మాత్రమే కాకుండా ఫంక్షనాలిటీ కోసం యాపిల్ డిజైన్ చేసింది.
స్పేషియల్ వీడియో రికార్డింగ్ కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడిందని టెక్ నిపుణులు చెబుతున్యనారు. ప్రస్తుతం ఐఫోన్ 15ప్రొ, ప్రొ మ్యాక్స్‌లో స్పేషియల్ వీడియో రికార్డు సామర్ధ్యం ఉంది. ఈ ఫీచర్ కోసం వర్టికల్ అలైన్మెంట్తో కూడిన కెమెరాలు అవసరం కావడంతో ఐఫోన్ 16 సిరీస్‌లో తరహా కెమెరా లేఅవుట్‌కు యాపిల్ మొగ్గుచూపింది.
ఐఫోన్ 16, 16 ప్లస్ వంటి బేస్ మోడల్స్కూ వర్టికల్ లేఅవుట్ కెమెరా లేఅవుట్‌ను తీసుకురావడం ద్వారా పెద్దసంఖ్యలో యూజర్లకు స్పేషియల్ వీడియో రికార్డింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోంది. స్పేషియల్ వీడియోతో పాటు లార్జర్ సెన్సర్స్, మెరుగైన లో లైట్ పెర్ఫామెన్స్, షార్పర్ ఇమేజెస్ వంటి పలు ప్రయోజనాలను వర్టికల్ లేఅవుట్ యూజర్లకు ఆఫర్ చేయనుంది. నాన్-ప్రొ మోడల్స్‌లో కెమెరా అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమం చేయడంతో పాటు అదనపు కెమెరా మాడ్యూల్స్‌కు అధిక స్పేస్‌ను అందించే వెసులుబాటు కల్పిస్తుంది.
Read More :
Bruhat Soma: స్పెల్లింగ్ బీ పోటీ నెగ్గిన 12 ఏళ్ల భారత సంతతి విద్యార్థి