Apple iPhone | భారత్లో యాపిల్ అభిమానులకు శుభవార్త. ఇటీవలే విడుదలైన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) భారత్ (India)లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే యాపిల్ స్టోర్స్, వెబ్సైట్లో వీటి విక్రయాలు మొదలయ్యాయి. ఈ ఫోన్లను సెప్టెంబర్ 12న యాపిల్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రీ బుకింగ్స్ కూడా సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభమయ్యాయి. ఇవాళి నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు.
ఐఫోన్ 15 సిరీస్లో మొత్తం నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లతో పోల్చితే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు కీలక అప్ గ్రేడ్స్ చేసింది ఆపిల్. 48 మెగా పిక్సెల్ కెమెరా, యూఎస్బీ-సీ పోర్టు, కొత్త చిప్ సెట్, డైనమిక్ ఐలాండ్ తో పాటు మరిన్ని మార్పులు చేసింది. లుక్ కాస్త సేమ్ కన్పిస్తున్నా, ఫీచర్లు, పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఇంకా బెటర్ గా ఉండనుంది.
ఇక ఐఫోన్ 15, 15 ప్లస్ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో, పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 128 జీబీ బేస్ స్టోరేజీ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900 కాగా, 15 ప్లస్ ధర రూ. 89,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,34,900 నుంచి ప్రారంభం కానుండగా, 15 ప్రొ మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ ధర రూ. 1,59,900గా ఉంది. ఇక ఆపిల్ 15 సిరీస్ కోసం వినియోగదార్లు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచే ఈ ఫోన్ను దక్కించుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. దీంతో ఆయా స్టోర్ల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.
మరో విశేషం ఏంటంటే.. ప్రారంభ సేల్లో భాగంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలు ఐఫోన్ 15 పై స్పెషల్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పాత ఫోన్ ఎక్స్ఛేంజీకి రూ. 9,000 వరకు బోనస్ ఇస్తున్నారు. అలాగే పలు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐఫోన్ 15, ఐఫోన్15 ప్లస్ ఫోన్లకు రూ. 5,000 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో మొత్తం డిస్కౌంట్ కలిపి రూ. 14,000 అవుతుంది. అప్పుడు ఐఫోన్ 15 బేసిక్ మోడల్ రూ. 65,900 కే లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజీ బోనస్ మీ పాత ఫోన్ ధరను బట్టి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఫోన్ కాస్ట్ రూ. 20 వేలకు మించి ఉంటే రూ. 9,000 ఎక్స్ఛేంజీ బోనస్ ఉంటుంది. అదే రూ. 15,000 ఉంటే ఎక్స్ఛేంజీ బోనస్ రూ. 6,000 గా ఉంటుంది.
#WATCH | Apple’s iPhone 15 series to go on sale in India from today. Visuals from the country’s second Apple Store at Delhi’s Select Citywalk Mall in Saket. pic.twitter.com/1DvrZTYjsW
— ANI (@ANI) September 22, 2023
#WATCH | Maharashtra | Long queues of people seen outside Apple store at Mumbai’s BKC – India’s first Apple store.
Apple’s iPhone 15 series to go on sale in India from today. pic.twitter.com/QH5JBAIOhs
— ANI (@ANI) September 22, 2023
#WATCH | Maharashtra | Apple’s iPhone 15 series to go on sale in India from today. Visuals from Apple store at Mumbai’s BKC. pic.twitter.com/9Myom1ZiT6
— ANI (@ANI) September 22, 2023
#WATCH | Delhi | Rahul, the first customer today at the Apple Store at Select Citywalk Mall in Saket, says, “It was a great experience. I was in the queue since 4 a.m. and then purchased the phone. I have always had top phones with me. I have an iPhone 13 Pro Max and an iPhone 14… https://t.co/UKz4MQeVRY pic.twitter.com/5Z2McjIOMC
— ANI (@ANI) September 22, 2023
Also Read..
Chandrayaan-3 | చంద్రుడిపై అద్భుతం జరగబోతుందా.. ప్రపంచం కళ్లన్నీ మళ్లీ ఇస్రో వైపే!
NASA | కాంతి సంవత్సరాల దూరంలో బేబి సూర్యుడు..! ఫొటోను తీసిన జేమ్స్వెబ్ టెలిస్కోప్..!