న్యూయార్క్, జూన్ 12: ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్లీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో కదలాడిన మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో కంపెనీ షేరు ధర రికార్డు స్థాయిలో లాభపడటమే ఇందుకు కారణం. కంపెనీ షేరు ధర 4 శాతం లాభపడి 215.04 డాలర్లకు చేరుకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ 3.29 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ షేరు విలువ పడిపోవడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 3.24 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది.