Apple | ప్రముఖ టెక్నాలజీ దిగ్గం ఆపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రైవసీ విషయంలో కంపెనీ ఉత్పత్తులకు మంచి పేరునున్నది. అయితే, తన ఉత్పత్తులతోనే కంపెనీ ఉద్యోగులపై నిఘా వేస్తుందని ఓ కంపెనీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. ఐఫ్యాడ్స్, ఐఫోన్స్ తదితర వ్యక్తిగత డివైజ్‌ల సహాయంతో ఉద్యోగులపై నిఘా వేసినట్లుగా అమర్ భక్తా అనే ఓ కంపెనీ ఉద్యోగి క్యాలిఫోర్నియాలో దావా వేశారు. అమర్ భక్త ఆపిల్ డిజిటల్ అడ్వర్టైజింగ్ విభాగంలో 2020 నుంచి సేవలు అందిస్తున్నారు.
కంపెనీ చట్టవిరుద్ధంగా నిఘా వేస్తుందని ఆరోపించారు. కంపెనీ ఉద్యోగుల మొబైల్స్, ఇతర డివైజెస్‌లో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ని ఇన్స్టాల్ చేస్తుందని ఆరోపించారు. ఈమెయిల్, ఫొటో లైబ్రరీ, హెల్త్, స్మార్ట్ హోమ్ డేటా సహా వ్యక్తిగత వివరాలను యాపిల్ యాక్సెస్ చేస్తోందని.. అదే సమయంలో ఆపిల్ ప్రైవసీ పాలసీ విధానాల్లోని నిబంధనలను సైతం అమలు చేస్తుందని అమర్ భక్త పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగి మీడియాతో సహా ఎక్కడా కూడా పని వాతావరణంతో పాటు వేతనాలు, రాజకీయా కార్యకలాపాలపై చర్చించకూడండా చేస్తుందని దావాలో ఆరోపించారు.
విధుల గురించి పాడ్‌కాస్ట్‌లోనూ మాట్లాడొద్దని కంపెనీ ఆంక్షలు విధించిన్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి ఉద్యోగ సమాచారం తొలగించాలని సైతం నిబంధనలు విధించిందని చెప్పుకొచ్చాడు. ఆపిల్ పాలసీలు కఠినంగా ఉంటాయని.. అవన్నీ చట్టవిరుద్ధమేనన్నారు. దావాపై ఆపిల్ స్పందించింది. అందులోని అంశాల్లో ఎలాంటి వాస్తవాలు లేవని.. ఉద్యోగులకు వారి హక్కులపై ఏటా శిక్షణ ఇస్తామని చెప్పింది. తాము ప్రపంచంలోనే అత్యున్నతమైన ఉత్పత్తులు, సేవలు అందించడంపై దృష్టి సారించినట్లు కంపెనీ తెలిపింది. అయితే, గతంలోనే ఇద్దరు మహిళలు సైతం ఆపిల్‌పై పిటిషన్స్ వేశారు.