న్యూఢిల్లీ, మే 30: అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.144 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అన్ని విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.90 కోట్ల లాభంతో పోలిస్తే 60 శాతం వృద్ధి కనబరిచినట్టు వెల్లడించింది.
ఏడాది క్రితం రూ.3,546 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.4,302 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. 2022-23లో రూ.16,612 కోట్ల ఆదాయంపై రూ.819 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.